న్యూస్‌రీల్
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026
ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు
నంగునూరు/గజ్వేల్ రూరల్(సిద్దిపేట): పాలిసెట్ కళాశాలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా, వ్యవసాయ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 3,932 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,722 మంది హాజరు కావడంతో 94.56 శాతం నమోదైంది. సిద్దిపేటలో ఏడు, గజ్వేల్‌లో మూడు, హుస్నాబాద్‌లో ఒకటి కలిపి మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రత్యేక పరిశీలకులు మాలతి, ఫయీమొద్దీన్, డీవీఆర్ పాటిల్ అన్ని సెంటర్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్, రాజగోపాలపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పది రోజుల్లో ఫలితాలు వెలువడుతాయన్నారు. కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.


