నాచగిరీశుడి సేవలో ఎమ్మెల్సీలు | - | Sakshi
Sakshi News home page

నాచగిరీశుడి సేవలో ఎమ్మెల్సీలు

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

వర్గల్‌(గజ్వేల్‌): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రాన్ని బుధవారం ఎమ్మెల్సీలు డాక్టర్‌ వంటేరు యాదవరెడ్డి, అంజిరెడ్డి సందర్శించారు. వారికి ఈఓ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

బాల్య వివాహాన్ని

అడ్డుకున్న అధికారులు

గజ్వేల్‌రూరల్‌: బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ గణేశ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రజిత, ఆర్‌ఐ రాజు, పోలీసు సిబ్బందితో కలిసి బుధవారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి హమీద్‌ బుధవారం తెలిపారు. ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఈ నెల 16 నుంచి జూన్‌ 6 సాయంత్రం 5గంటల లోపు కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. జూన్‌ 10న ఉదయం 11గంటలకు కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ బడుల

బలోపేతమే లక్ష్యం

జిల్లా ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ రామస్వామి

దుబ్బాక: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ రామస్వామి అన్నారు. బుధవారం దుబ్బాక ఐఓసీ సమావేశం మందిరంలో నియోజకవర్గ స్థాయి పాఠశాల విద్యా కార్యక్రమాల వర్క్‌షాపును మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ శ్రీరాం సంగీత, ఏఎంసీ చైర్మన్‌ కొంగరి రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేర్ల కై లాసంతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఎంఈఓలు, మాస్టర్‌ ట్రైనర్స్‌ మధుసూదన్‌, సాదత్‌అలీ, ఉమాశంకర్‌ తదితరులు ఉన్నారు.

అక్షరాస్యత పెంచుదాం

మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌

సిద్దిపేటజోన్‌: అక్షరాస్యతలో నిర్దేశిత లక్ష్యం అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌ సూచించారు. బుధవారం విపంచి ఆడిటోరియంలో ఉల్లాస్‌ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆర్పీ, ఓబీఎస్‌లకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు అక్షరాస్యత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని మహిళా సంఘాల్లో 1300 మంది మహిళలను నిరక్షరాస్యులుగా గుర్తించినట్టు తెలి పారు. వారికి స్వచ్ఛందంగా చదువు చెప్పడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కొక్క ఆర్పీ, ఓబీ పది మంది మహిళలకు చదువు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మెప్మా అధికారు లు హన్మంతరెడ్డి, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement