గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళలు శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ప్యాకేజీలు, పరిహారాల కోసం హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన వీరు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. 2019నుంచి ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి అండగా నిలిచిన దామోదర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రతినిధులు హయతొద్దీన్ తదితరులున్నారు.
సుందరీకరణ పనులు వేగిరం చేయండి
హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను వేగిరం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. శుక్రవారం మ్యాప్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువులో నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జిని పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సుందరీకరణ పనులు పూర్తయితే ఎల్లమ్మ చెరువు పర్యాటక కేంద్రంగా మారి, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండిలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్ భూక్య సంపత్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.
సామాజిక బాధ్యతకు
ఎన్‌ఎస్‌ఎస్ దోహదం
రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేశ్వర్‌రావు
వర్గల్(గజ్వేల్): ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు విద్యార్థుల్లో సేవా నిరతి, సామాజిక బాధ్యతను పెంపొందింపజేస్తాయని రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చలమల్ల వెంకటేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో స్థానిక పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల వారం రోజుల ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవాపథకం) శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ సమాజం, మానవ సంబంధాల పెంపు, నిత్యజీవితంలో సమస్యలపై శిబిరం ద్వారా విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ గోవిందరావు, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ జీ భాగ్యలక్ష్మి, రాధా రాణి, ఏటీపీ వర్జిని పాల్గొన్నారు.


