డ్రైవర్ల అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్ల అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

గజ్వేల్‌: డ్రైవర్ల అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్‌–అలైవ్‌’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమని అన్నారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడూ మనసు ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. డ్రైవింగ్‌లో ఫోన్‌ వాడటం ఎంతమాత్రం సరికాదన్నారు. మరోవైపు సీటు బెల్టులు వాడటం నమోషీగా భావిస్తున్నారని చెప్పారు. కారు ప్రయాణంలో డ్రైవింగ్‌ చేసే వ్యక్తితోపాటు అందులో ప్రయాణించే ప్రతిఒక్కరూ సీటు బెల్టులు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్లలో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమాల లక్ష్యమన్నారు.

ఆటోడ్రైవర్లకు యూనిఫామ్‌ల పంపిణీ

సదస్సులో భాగంగా 150మందికిపైగా ఆటోడ్రైవర్లకు యూనిఫారమ్‌లను పంపిణీ చేశారు. వైద్యశిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు చేయించుకున్న మరికొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన వీడియో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ సదస్సులో జిల్లా కలెక్టర్‌ హైమావతి, సీపీ రష్మీపెరుమాళ్‌, గజ్వేల్‌ ఆర్‌డీఓ వీవీల్‌ చంద్రకళ, గజ్వేల్‌ ఏసీపీ నర్సింహులు, జిల్లాలోని ఏసీపీలు, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా డీజీపీని పోలీసులు సన్మానించారు.

రోడ్డు నిబంధనలు పాటిస్తూఆదర్శంగా నిలవాలి

చైతన్యం పెంపొందించేందుకే‘అరైవ్‌–అలైవ్‌’ : డీజీపీ శివధర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement