చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పాలకవర్గానికి అనుబంధంగా ఎన్నిక కావాల్సిన నాలుగు కో– ఆప్షన్ సభ్యులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ ఎస్.నాగేందర్ తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్, రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల నుంచి ఇద్దరు సభ్యులు, మైనార్టీల నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయింది. వచ్చిన దరఖాస్తుల్లో ఇద్దరు మైనార్టీలు, నలుగురు మాజీ ప్రజాప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. రిటైర్డ్ గెజిటెడ్ అధికారులెవరూ దరఖాస్తు చేసుకోలేదు. స్క్రూటినీ, విత్‌డ్రాల అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారు.
నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు
రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు దూరం


