ప్రాంతీయ అభివృద్ధికి పరిశ్రమ దోహదం | - | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ అభివృద్ధికి పరిశ్రమ దోహదం

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

ప్రాంతీయ అభివృద్ధికి పరిశ్రమ దోహదం రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు పేదల సొంతింటి కల సాకారం ఆరోగ్యంగా ఉంటేనే సమాజాభివృద్ధి

టీజీఐఐసీ వైస్‌ చైర్మన్‌ శశాంక

నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఈప్రాంతం అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశాంక అన్నారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ఆదివారం టీజీఐఐసీ అధికారులు సందర్శించారు. ఈసందర్భంగా ఫ్యాక్టరీలో ఆయిల్‌ ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, నీటి సరఫరా, రహదారుల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం శశాంక మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే కొత్తగా మరిన్ని పరిశ్రమలు వస్తాయని దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నర్మేటలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఆయిల్‌ పరిశ్రమ తెలంగాణ ప్రాంతానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు.

మంత్రి వివేక్‌

పటాన్‌చెరు: రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వివేక్‌ తెలిపారు. పటాన్‌చెరులో ఆదివారం జరిగిన మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని హామీఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆ ప్రాంత సమస్యలను మంత్రికి వివరించారు. నీలం మధు మాట్లాడుతూ పటాన్‌చెరులో సీఎస్‌ఆర్‌ నిధుల ఖర్చుపై విచారణ చేయాలని మంత్రికి విన్నవించారు.

డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

ములుగు(గజ్వేల్‌): కాంగ్రెస్‌ పాలనలో పేదల సొంతింటి కల సాకారం అవుతోందని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. ములుగు, అన్నసాగర్‌ గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గూడులేని నిరుపేదలందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రాజీవ్‌ గాంధీ పంచా యతీ రాజ్‌ సంఘటన్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జిల్లా కోఆఫ్షన్‌ మాజీ సభ్యుడు సయ్యద్‌ సలీం, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌గుప్త, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

గజ్వేల్‌రూరల్‌: ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఏసీపీ నరసింహులు అన్నారు. ఆదివారం గజ్వేల్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రోమో రన్‌ను సీఐలు రవికుమార్‌, లతీఫ్‌లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 10కే, 5కే రన్‌లో విజేతలుగా నిలి చిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో పాటు తెలంగాణ రన్నర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement