● దుబ్బాక బల్దియాలో ఎన్నికల సందడి ● సభ్యుల ఎంపికకు రంగం సిద్ధం ● ఎమ్మెల్యే మద్దతు కోసం యత్నాలు | - | Sakshi
Sakshi News home page

● దుబ్బాక బల్దియాలో ఎన్నికల సందడి ● సభ్యుల ఎంపికకు రంగం సిద్ధం ● ఎమ్మెల్యే మద్దతు కోసం యత్నాలు

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

● దుబ్బాక బల్దియాలో ఎన్నికల సందడి ● సభ్యుల ఎంపికకు రంగం సిద్ధం ● ఎమ్మెల్యే మద్దతు కోసం యత్నాలు

దుబ్బాక: దుబ్బాక మున్సిపల్‌లో కో ఆప్షన్‌ ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా ఈ ఎన్నికకు కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో ఆశావహుల్లో ఆసక్తి మొదలైంది. దుబ్బాకలో 20 వార్డులలో 35 వేలకు పైగా జనాభా ఉంది. దీంతో నలుగురు కో ఆప్షన్‌ సభ్యులను కౌన్సిల్‌కు ఎంపిక చేయాలి. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 11 మంది బీఆర్‌ఎస్‌, 4 కాంగ్రెస్‌, 2 బీజేపీ, 3 స్వతంత్రులు కౌన్సిలర్లుగా గెలిచారు. ముగ్గురు స్వతంత్రులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మొత్తం 14 మంది కౌన్సిలర్లతో బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ పీఠాన్ని కై వసం చేసుకుంది. కో ఆప్షన్‌ పదవుల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీలోని ఆశావహులు అప్పుడే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు టికెట్‌ రానివారు, మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి అవకాశం కల్పించాలని కోరారు.

13 నుంచి దరఖాస్తులు

కో ఆప్షన్‌ సభ్యులకు అభ్యర్థులు ఈ నెల 13 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 20వ తేదీ తర్వాత 3 రోజుల పాటు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సభ్యులను ఎన్నుకుంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement