● ఆశావాహుల ప్రయత్నాలు ముమ్మరం● హరీశ్‌, వంటేరు ఆశీస్సుల కోసం యత్నం ● గజ్వేల్‌ మున్సిపాలిటీలో ఆసక్తికరం | - | Sakshi
Sakshi News home page

● ఆశావాహుల ప్రయత్నాలు ముమ్మరం● హరీశ్‌, వంటేరు ఆశీస్సుల కోసం యత్నం ● గజ్వేల్‌ మున్సిపాలిటీలో ఆసక్తికరం

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

● ఆశావాహుల ప్రయత్నాలు ముమ్మరం● హరీశ్‌, వంటేరు ఆశీస్సుల కోసం యత్నం ● గజ్వేల్‌ మున్సిపాలిటీలో ఆసక్తికరం

గజ్వేల్‌: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో ‘కో–ఆప్షన్‌’సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం కావడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున బరిలో ఉన్నారు. ఇక్కడ నాలుగు కో–ఆప్షన్‌ స్థానాలు ఉండగా, ఇందులో మైనార్టీలకు రెండు స్థానాలు (మహిళ, జనరల్‌), మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్థానాలు (మహిళా, జనరల్‌)కు కేటాయించారు. మైనార్టీ కోటా నుంచి పట్టణానికి చెందిన చెందిన బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మజీద్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు యూసుఫొద్ధీన్‌, మాజీ కౌన్సిలర్‌ రహీమ్‌, అజీజ్‌, ఉమర్‌, సింగారం మతీన్‌ తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ ప్రతినిధుల కోటా నుంచి తలకొక్కుల దుర్గాప్రసాద్‌, అల్వాల బాలేష్‌, ఆర్‌కే శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన ప్రతాప్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ రజిత, అత్తెల్లి రవి, దయానందరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డిల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పోటీ నుంచి తప్పుకున్న కొందరికీ కో–ఆప్షన్లలో అవకాశం కల్పిస్తామని కొందరికి పార్టీ పెద్దలు మా ఇచ్చినట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement