ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర
మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్
గజ్వేల్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్‌లోని విద్యుత్‌శాఖ డీఈ కార్యాలయం ముందు కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు జీవో 11 ప్రకారం పని కల్పించాలని, విద్యార్హతల మేరకు కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, ఆర్టిజన్ కార్మికుల జేఏసీ గజ్వేల్ డివిజన్ చైర్మన్ భూపతిరాజు, కన్వీనర్ శ్రీధర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్లేష్, గజ్వేల్ డివిజన్ వైస్‌చైర్మన్ యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


