మల్లన్న ఆలయ పరిసరాలలో వాహన ఫీజు వసూలు చేసేందుకు పంచాయతీ చర్యలు చేపట్టింది. ఇందుకు పంచాయతీ పాలక మండలి సైతం తీర్మానం చేసింది. తీర్మానాన్ని పైఅధికారుల అనుమతి కోసం పంపించాం. అనుమతి రాగానే వాహన ఫీజు వసూలు చేసేందుకు టెండర్ నిర్వహిస్తాం.
– శ్రీనివాస వర్మ, ఎంపీఓ
మరోసారి ఆలోచించాలి
మల్లన్న ఆలయ పరిసరాలలో వాహనాల ఫీజు వసూలు చేసేందుకు బారికేడ్స్ (గేట్లు) ఏర్పాటు చేస్తే భక్తులతోపాటు స్థానికులకు ఇబ్బందే. మరోసారి ఆలోచించాలి. గతంలో కొమురవెల్లి పంచాయతీ అధికారులు టోల్ వసూలు చేశారు. భక్తులకు, టోల్ నిర్హాహకులకు గొడవలు కావడంతో అధికారులు రద్దు చేశారు.
–తేలు ఇస్తారి, అయినాపూర్


