రైతు భరోసా.. రూ.431.17 కోట్లు జమ | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా.. రూ.431.17 కోట్లు జమ

Mar 24 2026 8:59 AM | Updated on Mar 24 2026 8:59 AM

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం కుకునూరుపల్లిలో కొలువైన సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వివరాలు 9లో u ● 7,19,500 ఎకరాలకు యాసంగి సాగు పెట్టుబడి సాయం ● త్వరలో మిగతా సాగు భూములకు సైతం ఎన్నికల లెక్క.. చెప్పాలి పక్కా మున్సిపల్‌ ఎన్నికలు ముగిసినా చాలా మంది అభ్యర్థులు ఖర్చుల వివరాలు అప్పగించలేదు. వివరాలు 8లో u

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం కుకునూరుపల్లిలో కొలువైన సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వివరాలు 9లో u
తొలి విడతగా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు నిధులు విడుదల
● 7,19,500 ఎకరాలకు యాసంగి సాగు పెట్టుబడి సాయం ● త్వరలో మిగతా సాగు భూములకు సైతం

సాక్షి, సిద్దిపేట: వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు యాసంగి సాగు కోసం ఒక్కో ఎకరం చొప్పున రైతు భరోసా రూ.6వేలు బ్యాంక్‌ ఖాతాల్లో సోమవారం జమ అయ్యాయి. నర్మేట ఆయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయం కింద ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 9,33,046 మంది రైతులకు 7,19,500 ఎకరాలకు రూ.431.17కోట్లు జమ అయ్యాయి.

ఏప్రిల్‌లో పూర్తిగా..

తొలి విడతలో ప్రతి రైతుకు ఎకరం భూమికి రైతు భరోసా అందజేశారు. మరో 20 రోజుల్లో 3 ఎకరాల వరకు, ఏప్రిల్‌లో అందరికీ రైతు భరోసాను అందజేయనున్నారు. యాసంగి సాగు కోసం రైతు భరోసా డబ్బులు ఎంతో ఉపయోగపడనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement