తీరు మారకపోతే చర్యలు | - | Sakshi
Sakshi News home page

తీరు మారకపోతే చర్యలు

Mar 24 2026 8:59 AM | Updated on Mar 24 2026 8:59 AM

● వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం తగదు ● కలెక్టర్‌ హైమావతి ● గజ్వేల్‌లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి తనిఖీ

● వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం తగదు ● కలెక్టర్‌ హైమావతి ● గజ్వేల్‌లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి తనిఖీ

గజ్వేల్‌: కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హైమావతి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్‌లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డు లను కలియ తిరిగారు. అటెండెన్స్‌ రిజిష్టర్‌ను పరి శీలించారు. అనుమతి లేనిదే ఎవరూ సెలవు తీసు కోవద్దన్నారు. గర్భిణుల్లో మనోధైర్యం నింపు తూ మంచి ఆహారపు నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నార్మల్‌ డెలివరీల సంఖ్య పెరిగేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు టీకాలను సక్రమంగా అందించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement