కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ వార్జిక బడ్జెట్ రూ.23.03 కోట్లను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సమక్షంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రాంట్లను కలుపుకొని రూ.23.03 కోట్లు అంచనా బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సాధారణ అంచనా ఆదాయం రూ.4.36 కోట్లు.. వ్యయం 4.35కోట్లు.. మిగిలిన మొత్తం రూ.1.23లక్షలు. మిగులులో 3వవంతు బలహీనవర్గాలకు కేటాయిస్తూ బడ్జెట్ రూపొందించారు. వార్షిక బడ్జెట్‌ను సీనియర్ అకౌంటెంట్ రేణుక చదివి వినిపించగా పాలకవర్గ సభ్యులు చేతులు ఎత్తి ఆమోదించారు. సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ మేడిశెట్టి ఉమ, కౌన్సిలర్లు ఒగ్గు వెంకటమ్మ, కమలాపురం గీతాంజలి, కొమ్ము రాజేశ్వరి, నిమ్మ సుప్రజ, వెలుగల దుర్గయ్య, పోతుగంటి ప్రసాద్, బుదరి సురేష్, వీరబత్తిని సదానందం, ఎజాజ్‌అహ్మద్, షరీఫాబేగం, కమిషనర్ ఎస్.నాగేందర్, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


