గోటి తలంబ్రాలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

గోటి తలంబ్రాలు సిద్ధం

Mar 24 2026 8:59 AM | Updated on Mar 24 2026 8:59 AM

గజ్వేల్‌రూరల్‌: భద్రాచలంలోని సీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేశారు. గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్తసమాజం వ్వవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఈ బృహత్కర కార్యానికి శ్రీకారం చుట్టగా గోటి తలంబ్రాల దీక్షలో వేలాది మంది భక్తులు పాల్గొని రామనామ స్మరణతో భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గజ్వేల్‌–ప్రజ్ఞాఫూర్‌ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భక్తులు గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్నారు. సోమవారం పట్టణంలోని మురళీకృష్ణాలయం నుంచి భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో గోటి తలంబ్రాలను తరలించనున్నారు. ఈమేరకు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాల కలశాలతో అందజేశారు.

కేసీఆర్‌, హరీశ్‌రావు

ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ వద్ద సోమవారం బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు యాదగిరి, పట్టణ సమన్వయకర్త నరేశ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఫ్యాక్టరీకి తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేసీఆర్‌, హరీశ్‌రావు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు పర్శరాములు, రమేశ్‌, చింటూ, గఫూర్‌, కిరణ్‌గౌడ్‌, రమేశ్‌, అనిల్‌రెడ్డి, శ్రవణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

యాప్‌లో కాదు

షాపులో ఉంచండి

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులకు సరిపడా యూరియా యాప్‌లో కాదని.. షాపుల్లో ఉంచాలని, యూరియా కొరతతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మండిపడ్డారు. సోమవారం చిన్నకోడూరులో రైతు సంఘం మహాసభ నిర్వహించారు. ఆయన యూరియా యాప్‌ల బుకింగ్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వెంకట్‌, శ్రీనివాస్‌, బాల్‌రెడ్డి, హనుమంతారెడ్డి, రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, కిష్టారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement