ప్రొటోకాల్‌ అమలయ్యేలా చూడండి | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ అమలయ్యేలా చూడండి

Mar 24 2026 8:59 AM | Updated on Mar 24 2026 8:59 AM

ఆర్‌డీఓకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పాలకవర్గం ఫిర్యాదు

ఆర్‌డీఓకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పాలకవర్గం ఫిర్యాదు

గజ్వేల్‌: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందన, వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్యన్‌కర్‌ పద్మాబాయితోపాటు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సోమవారం గజ్వేల్‌ ఆర్‌డీఓ వీవీఎల్‌ చంద్రకళకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఇటీవల నిర్వహించిన రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్‌ నేతలు నిర్వహించారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రొటోకాల్‌ లేని నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు దీనిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement