ములుగు(గజ్వేల్): జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి నగరంలోని సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షీరసాగర్‌లో ఈ నెల 27 అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న కోదండ రామస్వామి కల్యాణ మహోత్సవానికి సంబంధించిన అహ్వాన పత్రికను సీఎం చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. అనంతరం సీఎంకు ఆహ్వానపత్రిక అందజేసి స్వామివారి కల్యాణానికి రావాలంటూ ఆహ్వానించారు. అందుకు సానుకూ లంగా స్పందించిన సీఎం.. తప్పకుండా వస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు.


