నాణ్యమైన ఆహారం అందించండి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన ఆహారం అందించండి

Mar 16 2026 8:56 AM | Updated on Mar 16 2026 8:56 AM

కలెక్టర్‌ హైమావతి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విద్యార్థినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్‌ హైమావతి వసతి గృహ వార్డెన్లను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని పోస్ట్‌ మెట్రిక్‌ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాలికల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కామన్‌ డైట్‌ మెనూ పాటిస్తూ రుచికరంగా ఆహారం అందించాలన్నారు. స్టోర్‌ రూమ్‌ లో సరుకులు తనిఖీ చేస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వాడాలని సూచించారు. స్టాక్‌ రిజిస్టర్‌ సరిగ్గా నిర్వహించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement