తొలిరోజు 99.19% హాజరు | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు 99.19% హాజరు

Mar 15 2026 6:45 AM | Updated on Mar 15 2026 6:45 AM

పది పరీక్షలు షురూ..

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌, డీఈఓ

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 15,332 మంది విద్యార్థులకు 15,318 మంది హాజరయ్యారు. 99.19శాతం హాజరు నమోదైంది. తొలిరోజు తెలుగు పరీక్షను రాశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాశారు. నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణను కలెక్టర్‌ హైమావతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. – ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

Advertisement
 
Advertisement
Advertisement