సేవాభావం అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సేవాభావం అలవర్చుకోవాలి

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

సేవాభావం అలవర్చుకోవాలి

ములుగు(గజ్వేల్‌): విద్యార్థులు చదువుతోపాటు సేవాభావం అలవర్చుకోవాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ జె.చీనా అన్నారు. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎప్‌సీఆర్‌ఐ)లో గురువారం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌.ఎంఎస్‌ శ్రీనిధి ఆధ్వర్యంలో వలంటీర్లకు నిర్వహించిన ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. ఎన్‌సీసీ హెడ్‌ మలేషా మాట్లాడుతూ విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధిలో ఎన్‌ఎస్‌ఎస్‌ పాత్ర కీలకమైందన్నారు. ప్రస్తుత సమాజంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకుని సుస్థిరమైన పరిష్కారాలను కనిపెట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement