పకడ్బందీగా ఈ–నామ్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఈ–నామ్‌

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటజోన్‌: జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌ మార్కెట్‌లలో ఈ –నామ్‌ 2.0 వెర్షన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ హైమావతి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో సిద్దిపేట, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ట్రేడర్లు, కమిషన్‌ ఏజెంట్లతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కువ సంఖ్యలో కంప్యూటర్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ–నామ్‌ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement