పకడ్బందీగా పది పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పది పరీక్షలు

Mar 12 2026 9:07 AM | Updated on Mar 12 2026 9:07 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తరగతి పరీక్షల నిర్వహణ అధికారి లక్ష్మయ్యతో కలిసి డీఈఓ మాట్లాడారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష సమయానికి కంటే గంట ముందు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 82 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, ఏడుగురు రూట్‌ ఆఫీసర్లు, 82 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్‌ మెంటల్‌ ఆఫీసర్లు, 24 స్టోరేజ్‌ పాయింట్‌ కస్టోడియల్‌ అధికా రులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతగా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

హాజరుకానున్న

15,358 మంది విద్యార్థులు

ఐదు నిమిషాలు వెసులుబాటు

జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement