మాజీమంత్రి హరీశ్‌రావు ఉదారత | - | Sakshi
Sakshi News home page

మాజీమంత్రి హరీశ్‌రావు ఉదారత

Mar 3 2026 9:18 AM | Updated on Mar 3 2026 9:18 AM

సిద్దిపేటజోన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రభిత చూపిన యాదవ విద్యార్థుల కోసం మాజీమంత్రి హరీశ్‌రావు ఉదారత్వం చాటుకున్నారు. యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన నెల వేతనం రూ.2లక్షలు అందచేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మంచి కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. హరీశ్‌రావును కలిసిన వారిలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు ఐలయ్య, విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

పురస్కారాలకు నెల వేతనం విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement