వర్గల్(గజ్వేల్): సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటలకు సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయంతోపాటు, ఉప ఆలయాలకు ద్వార బంధనం (మూసి వేయడం) జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి రంగాచారి తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు గ్రహణ సంప్రోక్షణ అనంతరం అర్జిత సేవలు యథావిదిగా కొనసాగుతాయన్నారు. ఈ విషయం భక్తజనులు గమనించాలని ఆయన కోరారు.
చేర్యాల(సిద్దిపేట): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేర్యాల నకాశీ చిత్రకళలపై గీతం యూనివర్సిటీ ఆర్ట్స్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోమవారం స్థానిక చిత్ర కళాకారుడు నాగిళ్ల గణేశ్ ఇంటికి గీతం విద్యార్థులు వచ్చారు. రెండు రోజుల పాటు విద్యార్థులు ఇక్కడే ఉండి చిత్రకళపై తెలుసుకోనున్నట్లు గణేశ్ తెలిపారు. ఈ సందర్భంగా నకాశీ చిత్ర కళలను రూపొందించే విధానం వివరించారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బోయినిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో వాటర్ స్పోర్ట్స్ అకాడమిలో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ సోమవారం తెలిపారు. 5వ తరగతిలో 10 మంది బాలికలకు, 10 మంది బాలురలకు సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు ఈ నెల 12లోగా జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
హుస్నాబాద్: వైద్య వృత్తిలో విశిష్ట సేవలకు గుర్తింపుగా డాక్టర్ ధర్మానాయక్‌కు వైద్యరత్న బంగారు నంది అవార్డు వరించింది. ఆదివారం మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో వైద్యరత్న బంగారు నంది అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని సురక్ష ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ ధర్మానాయక్ 11 ఏళ్లుగా పేద ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ఫౌండేషన్ సంస్థ చైర్మన్ శిరీషరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
ఆలయాలకు ద్వారబంధనం
నేడు మల్లన్న ఆలయం మూసివేత
కొమురవెల్లి(సిద్దిపేట): చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఈఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు దర్శనాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు తదితర సేవలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు రండి
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ఎంపీ రఘునందన్‌రావుకు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావులకు ఈఓ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయవర్గాలు ఆహ్వానపత్రికలు అందజేశారు. ఈ నెల 8 నుంచి ఉత్సవాలు జరుగనున్నాయని తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
నకాశీ చిత్రకళపై అవగాహన
దరఖాస్తుల ఆహ్వానం
ధర్మానాయక్‌కు
బంగారు నంది అవార్డు