పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
సిద్దిపేటరూరల్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే పోటీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. యూజీసీ నెట్, జేఈఈ తదితర ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం సెంటర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా, పవర్ సప్లై, నీటి వసతి, ఫర్నిచర్, టాయిలెట్స్, కంప్యూటర్లు, నెట్ సౌకర్యం ఇతరత్రా అన్ని సౌకర్యాలు చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశం లో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ రాజ్ కుమార్, కేవీ ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్, నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేందర్, పోలీస్, ఎన్‌ఐిసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళిక ఏర్పాటు చేయండి
జిల్లాలో ఎలాంటి విపత్తులు జరిగినా వెంటనే స్పందించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విపత్తుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు వారి వద్ద ఉన్న వివరాలను విపత్తు శాఖకు అందించాలన్నారు. ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా వెంటనే స్పందించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అదనపు డీసీసీ సుభాష్‌చంద్రబోస్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి
అధికారులతో కలెక్టర్ సమావేశం


