సామాజిక దృక్పథంతో ముందుకుసాగాలి
గజ్వేల్: విద్యార్థులు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని ఏబీవీపీ ఆలిండియా స్టేట్ యూనివర్శిటీస్ కో–కన్వీనర్ కమల్‌సురేశ్ పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో సోమవారం విద్యార్థులకు నగర అభ్యాస వర్గ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సురేశ్ మాట్లాడుతూ ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే, విద్యార్థుల్లో సామాజిక సేవను పెంపొందించడానికి ప్రయత్నిస్తుందన్నారు. రక్తదాన శిబరాలు, మొక్కలు నాటడం, ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత బోధనా తరగతులు లాంటి కార్యక్రమాలతోపాటు మహిళల్లో ఆత్మరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌డీ(స్టూడెంట్ ఫర్ డెవలప్‌మెంట్) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ్ జిల్లా ప్రచారక్ జనార్దన్‌జీ, జిల్లా కన్వీనర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ నేత కమల్‌సురేశ్


