పాఠశాలలో నమూనా బ్యాంకు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో నమూనా బ్యాంకు

Dec 2 2025 9:42 AM | Updated on Dec 2 2025 9:42 AM

పాఠశా

పాఠశాలలో నమూనా బ్యాంకు

మద్దూరు(హుస్నాబాద్‌): ధూళ్మిట్ట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలో ‘స్కూల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ధూళ్మిట్ట’ పేరిట విద్యార్థులు నిర్వహించుకునే నమూనా బ్యాంక్‌ను హెచ్‌ఎం అనుముల కరుణాకర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులకు ‘మనీ అండ్‌ బ్యాంకింగ్‌’ అనే చాప్టర్‌ బాగా అవగాహన అయ్యేందుకు ఈ బ్యాంకు బాగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులే మేనేజర్‌గా, క్యాషియర్‌గా వ్యవహరించారు. అలాగే విద్యార్థులు రూ.50తో ఆ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటయ్య, రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు. చేర్యాల(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అకాడమిక్‌ ఆడిట్‌ నిర్వహించారు. మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.హుస్సేన్‌, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి సీనియర్‌ అధ్యాపకుడు డా.ఆర్తర్‌ ఆడిట్‌ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల నిర్వహణ తీరు, విద్యార్థుల పురోగతికి నిర్వహిస్తున్న కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. వారి వెంట కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ప్రణీత, అధ్యాపకులు ఉన్నారు. ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): గీత జయంతిని జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో విద్యా ర్థులు సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భగవద్గీత పవిత్ర గ్రంథం అన్నారు. విద్యార్థులతో భగవద్గీతలోని శ్లోకాలను పారాయణం చేయించారు. సిద్దిపేటజోన్‌: జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాల్లో ఇంటింటికీ వెళ్ళి స్థానికులకు బాల్య వివాహలు, పిల్లల హక్కుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధి లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలు, ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు. బాల్య వివాహాలు జరుగుతున్న విషయం తెలిస్తే 1098 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ సరస్వతి, వార్డు ప్రతినిధులు షాదుల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కళాశాలలో

అకాడమిక్‌ ఆడిట్‌

ఘనంగా భగవద్గీత

జయంతి వేడుకలు

బాల్య వివాహాలపై

అవగాహన

హెచ్‌ఐవీని తరిమికొడదాం

వర్గల్‌(గజ్వేల్‌): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా సోమవారం వర్గల్‌ మండల కేంద్రంలో పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది అవ గాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో ఆశా వర్కర్లు, కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాలలో నమూనా బ్యాంకు   
1
1/4

పాఠశాలలో నమూనా బ్యాంకు

పాఠశాలలో నమూనా బ్యాంకు   
2
2/4

పాఠశాలలో నమూనా బ్యాంకు

పాఠశాలలో నమూనా బ్యాంకు   
3
3/4

పాఠశాలలో నమూనా బ్యాంకు

పాఠశాలలో నమూనా బ్యాంకు   
4
4/4

పాఠశాలలో నమూనా బ్యాంకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement