శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
జగదేవ్‌పూర్(గజ్వేల్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఏసీపీ నర్సింహులు హెచ్చరించారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రమైన జగదేవ్‌పూర్, తిగుల్ గ్రామాల్లో సోమవారం పోలీసు కవాతు నిర్వహించారు. పాత నేరస్థులు, అనుమానితులను పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వివాదాలు, ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం కేంద్ర బలగాలతో చిన్నకోడూరులో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పౌరులందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి భయాలు, ప్రలోభాలకు లొంగవద్దని చైతన్యవంతం చేశారు. కార్యక్రమలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సైఫ్ అలీ, ఎంపీడీఓ జనార్దన్, తహసీల్దార్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లఘిస్తే చర్యలు
కొండపాక(గజ్వేల్): త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏసీపీ హెచ్చరించారు. కుకునూరుపల్లి పోలీస్టేషన్‌న్లో కొండపాక, కుకునూరుపల్లి మండలాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణను బంద్ చేశామని, ఎవరైనా నిర్వహిస్తే సమాచారం అందించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఏసీపీ సూచించారు. కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏసీపీ నర్సింహులు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు


