అభివృద్ధి పనులు వేగిరం చేయండి
కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు: కలెక్టర్ హైమావతి
గజ్వేల్: మండల పరిధిలోని ఆహ్మదీపూర్ పీహెచ్‌సీలో విధులకు సకాలంలో హాజరుకాని వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది ఒక రోజు వేతనాన్ని కట్ చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ఉదయం 9.34గంటల ప్రాంతంలో పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో హెచ్‌ఈఓ సత్యనారాయణరెడ్డి, ఆయామ్మ తప్పా ఎవరూ విధుల్లోకి రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్ వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది ఒక రోజు వేతనం కట్ చేయాలని ఆక్కడి నుంచే ఫోన్‌లో డీఎంహెచ్‌ఓకు ఆదేశాలిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదీలేదని హెచ్చరించారు.
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి బండగుట్టపై నిర్మాణం చేపడుతున్న వసతిగదులు, క్యూ కాంప్లెక్స్, కల్యాణ వేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 14న స్వామివారి కల్యాణం, జనవరి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమతున్నందునా భక్తులకు ఇబ్బందులు తలెత్తవద్దన్నారు. ఆర్‌ఆండ్ బీ, పంచాయతీరాజ్, దేవాదాయ, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్ శాఖల సహకారం తీసుకోవలన్నారు.
14 నుంచి శీఘ్రదర్శనం నిలిపివేత
మల్లికార్జున స్వామి ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని వచ్చే నెల 14నుంచి మార్చి 16తేదీ వరకు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, త్వరగా స్వామివారిని దర్శించుకునేందకే శీఘ్రదర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


