డ్రగ్స్‌ను తరిమేద్దాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం
హుస్నాబాద్: డ్రగ్స్‌ను తరిమికొట్టి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ దేశ, సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.


