ఉత్సాహంగా యువజనోత్సవం
లంబాడి వేషధారణలో సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థినులు
●అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ●ప్రతిభకు పదును పెట్టండి: సీపీ పిలుపు
సిద్దిపేటజోన్: చిన్నారుల విచిత్ర వేష ధారణలు.. లంబాడీ, కోయ, జానపద నృత్యాలతో యువజనోత్సవాలు కనులపండువగా సాగాయి. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విపంచి ఆడిటోరియంలో యువజనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. సాహిత్య, కళారంగాల్లో యువత రాణించాలని సూచించారు. ప్రతిభకు మరింత పదును పెట్టాలన్నారు. కళారంగంలో ప్రతిభ చూపిన వారికి చిరస్థాయిగా గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని, జిల్లాకు గుర్తింపు తేవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య. యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా యువజనోత్సవం
ఉత్సాహంగా యువజనోత్సవం


