లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సీపీ విజయ్‌కుమార్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లా కోర్టులో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. చిన్న చిన్న కాంపౌండబుల్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 2,230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీపడవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని సీపీ పేర్కొన్నారు.
రాష్ట్ర మహాసభలను
విజయవంతం చేయాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
సిద్దిపేటఅర్బన్: కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్‌లను తెచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మి క వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని, వాటి రద్దు కోసం ఉద్యమించడానికి సిద్ధమవుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు చెప్పారు. స్థానిక కార్మిక, కర్షక భవ నంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లా కేంద్రంలో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా మహాసభలు వాయిదా
సీఐటీయూ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు 9, 10 న సిద్దిపేటలో జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి తెలిపారు. ఈ మహాసభలను 15, 16 తేదీలలో నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భాస్కర్, ఉపాధ్యక్షురాలు పద్మ, సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి రవికుమార్, మహేశ్, బాలనర్సయ్య, భాస్కర్, షఫీ, రాజు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
దేశ ఔన్నత్యాన్ని చాటే గీతం
నర్సాపూర్: వందేమాతరం గీతం దేశ ఔన్నత్యాన్ని చాటుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. శనివారం పట్టణ చౌరస్తాలో విద్యార్థులు, పార్టీ నాయకులతో కలిసి వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆల పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా గీతం సారం తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్లేశ్‌గౌడ్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సురేశ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రాణికి నియామక పత్రం అందజేశారు.
టీఎంఎఫ్ నూతన కార్యవర్గం
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ గణిత ఫోరం (టీఎంఎఫ్) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నట్లు జిల్లా గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు. నూతన అధ్యక్షుడిగా కొండల్‌రెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, కూచన్‌పల్లి), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జెడ్పీహెచ్‌ఎస్, జాన్సిలింగాపూర్), కోశాధికారిగా నాగరాజు(జెడ్పీహెచ్‌ఎస్, చిన్నశంకరంపేట), ఉపకోశాధికారిగా బాలరాజు (జెడ్పీహెచ్‌ఎస్, కుర్తివాడ)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలు పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు వరప్రసాద్, పంతంగి శ్రీనివాస్, ధనుంజయ్, తదితర గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాతపద్ధతిలోనే
పత్తి కొనుగోళ్లు చేయాలి
సంగారెడ్డి: ఆన్‌లైన్ విధానానికి స్వస్తి చెప్పి పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని శివంపేట రైతులు డిమాండ్ చేశారు. శనివారం శివంపేట్ టోల్ గేట్ జాతీయ రహదారి 161 పై రైతులు నిరసన తెలిపారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి


