వేడెక్కిన రాజకీయం
● హరీశ్‌రావు సభలో ఎమ్మెల్యే సోదరుడు ప్రత్యక్షం ● వేడెక్కిన పటాన్‌చెరు రాజకీయాలు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రాజకీయాల్లో ఒక్క అడుగు ఎటువైపునకై నా దారితీస్తుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యా రు. అయితే ఆయన ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న సమయంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సోద రుడు గూడెం మధుసూదన్‌రెడ్డి హరీశ్‌రావు సభలో వేదికపై ప్రత్యక్షమవడం అధికార కాంగ్రెస్‌పార్టీలో కంగారు పుట్టించగా... బీఆర్‌ఎస్‌లో జోష్ నింపింది. అయితే బీఆర్‌ఎస్‌లోనే మరొక వర్గం మాత్రం మధుసూదన్‌రెడ్డి ప్రత్యక్షంపై గుస్సవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు కేటీఆర్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో ప్రారంభమవ్వగానే హరీశ్‌రావు ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదేసమయంలో ఒక్కసారిగా వేదికపైకి గూడెం మధుసూదన్‌రెడ్డి ఎక్కి కూర్చున్నారు. ఈ చర్యతో బీఆర్‌ఎస్ కొందరు నేతలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వేదికపై గూడెం మధుసూదన్‌రెడ్డి కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
స్థానిక నేతల్లో మొదలైన కంగారు
గూడెం మధుసూదన్‌రెడ్డి అనేక నెలలుగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో స్థానిక నేతలు కొందరు నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఒకసారిగా వేదికపై కనిపించడంతో ఆ నేతల్లో కంగారు మొదలైంది. మళ్లీ ఎమ్మెల్యే కుటుంబం బలం పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి అని లోలోపల గుసగుసలాడుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.


