ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి మేలు
నంగునూరు(సిద్దిపేట): రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త వంగ రాజేశ్వర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటల పరిశీలనలో భాగంగా శుక్రవారం ముండ్రాయి లోని రాజేశ్వర్‌రెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయలు, పూలు, పండ్ల తోటల సాగులో అవలంబిస్తున్న పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


