
కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం
దుబ్బాక: నిజాలు నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి, మేధావులు తీవ్రంగా ఖండించాయి. కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం తయారీతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దారుణాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నాయి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు ఏపీలో సాక్షి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ పలువురు డిమాండ్ చేశారు.
‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ
కేసులను ఉపసంహరించుకోవాలి
పలు పార్టీలు,
ప్రజాసంఘాల నేతల డిమాండ్