
తమను పున్నామ నరకం నుంచి తప్పించకపోయినా బతికుండగా వృద్ధా
10లో
● డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
● వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల మూసివేత
● బంద్‌లో పాల్గొన్న బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల
నాయకులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు
సిద్దిపేటకమాన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన సిద్దిపేట బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. బంద్‌లో బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట వారు బైఠాయించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు యాజమాన్యాలు ఒకరోజు ముందుగానే సెలవు ప్రకటించాయి. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్‌లు కావాలని డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని అన్నారు.

తమను పున్నామ నరకం నుంచి తప్పించకపోయినా బతికుండగా వృద్ధా