
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: గరీమా
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హెచ్చరించారు. శనివారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో విషజ్వరాలు, డెంగ్యూపై ఆరాతీశారు. పిల్లకు ఇచ్చే వాక్సిన్‌ను పరిశీలించారు. ఉద్యోగులు సకాలంలో హాజరై విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
గురుకులాల్లో
మిగులు సీట్లు కేటాయింపు
చేర్యాల(సిద్దిపేట): జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్లకు శనివారం చేర్యాలలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సమక్షంలో విద్యార్థినిలకు మిగులు సీట్లకు కౌనెలింగ్ చేసి అర్హులకు అడ్మిషన్‌లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి ప్రత్యూష, జిల్లా సమన్వయ అధికారి పోలోజు నర్సింహాచారి, ప్రిన్సిపాల్‌తో పాటు 800 మందికి పైగా విద్యార్థినిలు పాల్గొన్నారు.
ఎర్రోళ్లకు ఈటల పరామర్శ
చిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఎర్రోళ్ల తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం గంగాపూర్‌లోని ఆయన నివాసంలో ఈటల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు గంగాపూర్ పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, పరశురాలు, నాగరాజు పాల్గొన్నారు.
నియామక పత్రం అందుకున్న
మణికంఠేశ్వర్ రెడ్డి
హుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుస్నాబాద్‌కు చెందిన అయిలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్– 2 నియామక పత్రాన్ని అందుకున్నాడు. మణికంఠేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని చార్మినార్ ఏసీటీఓ (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్)గా పోస్టింగ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈయన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి శంషాబాద్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి అనిత హుస్నాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్‌గా పని చేశారు.
సాంప్రదాయ పద్ధతిలో
పండుగలు జరుపుకోవాలి
ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్‌కుమార్
సిద్దిపేటఎడ్యుకేషన్: మన పూర్వీకులు జరుపుకునే సాంప్రదాయ పండుగల్లో శాసీ్త్రయ దృక్పథం దాగి ఉందని, అయితే ప్రస్తుతం ఆధునిక పోకడలతో అశాసీ్త్రయ పద్ధతులతో పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయిందని సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక కళాశాల ప్రాంగణంలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి పర్యావరణరహిత దీపావళి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయంగా నిర్వహించే ప్రతి పండుగకు ఒక శాసీ్త్రయత ఉందన్నారు. ఆధునిక కాలంలో మన జీవన విధానంతో పాటు పండుగలు సైతం పొల్యూట్ అయ్యాయన్నారు. తద్వారా అనేక రకాల అనర్థాలకు సమాజం గురువుతుందని చెప్పారు. తిరిగి పాత సాంప్రదాయ పద్దతుల్లో పండుగలను జరపుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు.

విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: గరీమా

విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: గరీమా