
93 దుకాణాలకు 2,518 దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు మొత్తం 2,518 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. చివరి రోజైన శనివారం ఆశావాహులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడానికి సిద్దిపేట ఎకై ్సజ్ కార్యాలయానికి తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. సర్కిల్స్ వారీగా సిద్దిపేట 747, గజ్వేల్ 706, హుస్నాబాద్ 484, చేర్యాల 371, మిరుదొడ్డి 210 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. గత పాలసీలో 4,166 దరఖాస్తులు రాగా ప్రస్తుతం 2,518 మాత్రమే వచ్చాయి. డిపాజిట్ ధర రూ.3 లక్షలకు పెంచడంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడానికి అనాసక్తి చూపినట్టు చెప్తున్నారు. 23న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా వైన్‌షాపులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.