
చకచకా
ఇక భూ సర్వేలు
నెల రోజులుగా ఎదురుచూపులు
● జిల్లాలో 26 మండలాలకు 15 మందే సర్వేయర్లు
● లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకంతో తీరనున్న కొరత
● మొదటి బ్యాచ్‌లో 120 మంది ఉత్తీర్ణత
● నేడు సీఎం చేతుల మీదుగా
లైసెన్స్‌లను అందుకోనున్న సర్వేయర్లు
లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా ఉత్తీర్ణులైన వారు నెల రోజులుగా మండలాల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ఇచ్చారు.. పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకపోవడంతో కొంత నిరాశ చెందారు. నెల రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న రెండో బ్యాచ్‌కు వివిధ పరీక్షలను నిర్వహించిన తర్వాత వీరికి సైతం లైసెన్స్‌లను జారీ చేయనున్నారు.
సాక్షి, సిద్దిపేట: ఇక భూ సర్వేలు చక చకా కానున్నాయి. భూ సమస్య పరిష్కారం కోసం సర్వే చేయించేందుకు నెలల తరబడి ఎదురు చూసేవారు. ప్రజల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు, సర్వేయర్ల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించాలని నిర్ణయించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. జిల్లా వ్యాప్తంగా 352 మంది దరఖాస్తు చేశారు. అందులో మొదటి విడతలో 175 మందిని ఎంపిక చేయగా 150 మంది 50 రోజుల పాటు శిక్షణ పొందారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 120 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా నుంచి 120 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు పత్రాలను అందుకోనున్నారు.
తప్పనున్న ఇబ్బందులు

చకచకా