
‘సాక్షి’ జోలికొస్తే ఖబడ్దార్
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ,అక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటూ తన కలంతో ఎండగడుతున్న సాక్షిపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దారుణం. ప్రజా ఉద్యమాలకు అండగా ఉంటూ.. ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు విధానాలను కూకటివేళ్లతో పెకిలిస్తూ మొదటి నుంచి ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి జోలికొస్తే ఖబడ్దార్. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు తమ తప్పుడు ధోరణిని మానుకోకుంటే ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. సాక్షికి మాలమహానాడు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది.
– కాల్వ నరేష్, మాలమహానాడు
రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యులు
అరచేతిని అడ్డుపెట్టి
సూర్యకాంతిని ఆపుతారా..?
సాక్షిపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రభుత్వాలకు ,ప్రజలకు మధ్యన వారధి పత్రికలు. ఫోర్త్ ఎస్టేట్‌పై దాడి అంటే ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంపైనే దాడి చేసినట్లు. వాస్తవాలు రాస్తే దాడులు, కేసులు పెట్టడడం మంచి పరిణామం కాదు. దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో సాక్షిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదామని చూడడమే అవుతుంది. సాక్షికి కూటమి సర్కార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
– పల్లె వంశీకృష్ణాగౌడ్, న్యాయవాది

‘సాక్షి’ జోలికొస్తే ఖబడ్దార్