
నిజాలు రాస్తే దాడులా..?
నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నా సాక్షి పత్రికపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడడం సిగ్గుచేటు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వ అరాచకపాలనను ఎండగడుతుండడంతో జీర్ణించుకోలేక పోతోంది. సాక్షిపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతుంది. కక్ష సాధింపు చర్యలను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి బెదిరింపులకు భయపడొద్దు. మేం సాక్షికి అండగా ఉంటాం.
– బి.భాస్కర్, సీపీఎం రాష్ట్ర నాయకులు
‘సాక్షి’పై బాబు సర్కార్ దుర్మార్గం
చంద్రబాబు పెద్ద నియంత. మొదటి నుంచీ ప్రజాఉద్యమాలను అణగదొక్కుతూ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుండు. అక్రమ మద్యం తయారీని వెలుగులోకి తెచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సాక్షిపై కావాలనే చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై అక్రమ కేసులు మంచి పరిణామం కాదు. చంద్రబాబు సర్కార్ చర్యలను ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.

నిజాలు రాస్తే దాడులా..?