
నాణ్యమైన భోజనం అందించండి
● కలెక్టర్ హైమావతి ● పీహెచ్‌సీ, కస్తూర్బా పాఠశాల సందర్శన
సిద్దిపేటరూరల్: విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులతో ఓపికతో ఉంటూ వైద్యం అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టర్, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం రాఘవాపూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్ మెనూ పాటిస్తూ, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని, రోజువారీగా వ్యాయామం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు.