
మంత్రి వ్యాఖ్యలు సరికావు
విద్యార్థి కుటుంబ సభ్యుల రాస్తారాకో
హుస్నాబాద్: జిల్లెల్లగడ్డ గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థి వివేక్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మృతుని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేక్ ఆటలాడుతూ ప్రమాదవ శాత్తు మృతి చెందాడని మంత్రి అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్‌ల విచారణ పూర్తి కాకుండానే వ్యాఖ్యానించడంపై కేసు నిర్వీర్యం చేసినట్లేనని అన్నారు. వివేక్ మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివేక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.