
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటరూరల్: జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించేందుక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపా రు. బుధవారం సీపీ విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్లతో కలిసి ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది విధులు తదితర అంశాలపై సబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలన్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వైద్య సేవల్లో ముందుండాలి
సిద్దిపేటరూరల్: వైద్య సేవల్లో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉంచాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. డ్రైడే పాటించడంతోపాటు, శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌ఎంపీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా సిబ్బందికి సెలవులు మంజూరు చేయరాదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లావైద్యాధికారి ధనరాజు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.