
ప్రశాంతంగా నిమజ్జనం
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
డీజే సౌండ్లు, భక్తుల కోలాహలం, పోలీసు
బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర దుబ్బాకలో శనివారం రాత్రి ప్రారంభమై ఆదివారం సాయంత్రానికి ప్రశాంతంగా ముగిసింది. డీజే పాటలకు మహిళలు, యువతీయవకుల నృత్యాలు, మహారాష్ట్ర మహిళల
బ్యాండ్ ట్రూప్‌లతో శోభాయాత్ర కనుల
విందుగా సాగింది. నిమజ్జనానికి వివిధమండపాలనుంచి వివిధ ఆకృతుల్లో తీసుకువచ్చిన
వినాయక విగ్రహాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో
పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. – దుబ్బాకటౌన్

ప్రశాంతంగా నిమజ్జనం