వంటేరును పరామర్శించిన హరీశ్‌ | - | Sakshi
Sakshi News home page

వంటేరును పరామర్శించిన హరీశ్‌

Sep 7 2025 8:38 AM | Updated on Sep 7 2025 8:38 AM

వంటేర

వంటేరును పరామర్శించిన హరీశ్‌

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. వంటేరు మాతృమూర్తి వజ్రమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం యూకే నుంచి హైదరాబాద్‌ చేరుకున్న హరీశ్‌రావు విషయం తెలుసుకుని దౌలాపూర్‌ చేరుకుని ప్రతాప్‌రెడ్డి స్వగృహంలో వజ్రమ్మ చిత్ర పటానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తిగుల్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ ఎల్లయ్యను, కాలు విరిగి ఇంట్లో ఉన్న బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌కు కూడా హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, ఆంజిరెడ్డి, రంగారెడ్డి, కరుణకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు

క్రీడల్లో రాణించాలి

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య

మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు చదువుతో పాటు, క్రీడారంగంలో రాణించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్‌జీఎఫ్‌ మండలస్థాయి కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో క్రీడాలను ప్రారంభించారు. మండల పరిధిలోని 10 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమన్నారు. అనంతరం టీచర్స్‌ డే సందర్భంగా 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్‌, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ రాజేందర్‌, ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చక్కని బోధనతోనే

సత్ఫలితాలు: శ్రీనివాస్‌రెడ్డి

నంగునూరు(సిద్దిపేట): మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులను అవలంబించి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నంగునూరులో మండలస్థాయి టీఎల్‌ఎమ్‌ (టీచర్స్‌ లర్నింగ్‌ మెటీరియల్‌) బోధన అభ్యాసన ఉపకరణ మేళా శనివారం నిర్వహించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను ప్రదర్శించి సులభ బోధనకు ఎలా దోహదపడతాయో వివరించారు. స్టాళ్లను పరిశీలించిన ఆయన ప్రతిభ చూపిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఫిలితంగా సిద్దిపేట జిల్లా మూడు సంవత్సరాలుగా ముందంజలో ఉందన్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ డీఈఓగా ఎంపికై న శ్రీనివాస్‌రెడ్డిని ఎంఈఓ దేశిరెడ్డి, గెజిటెడ్‌ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు.

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట డిపో నుంచి అరుణాచల గిరిప్రదక్షణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్‌ను నడపనున్నట్లు డిపో మేనేజర్‌ రఘు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12న సిద్దిపేట నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, వేలూరు, అరుణాచలం, తిరుపతి, జోగులాంబ అమ్మవారి దర్శనానంతరం తిరిగి 16న బస్సు సిద్దిపేటకు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.5,200, పిల్లలకు రూ.4 వేలు చార్జి ఉంటుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వంటేరును  పరామర్శించిన హరీశ్‌1
1/2

వంటేరును పరామర్శించిన హరీశ్‌

వంటేరును  పరామర్శించిన హరీశ్‌2
2/2

వంటేరును పరామర్శించిన హరీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement