
రైల్వేలైన్ పనులు అడ్డగింత
చిన్నకోడూరు(సిద్దిపేట): తమకు నష్ట పరిహారం చెల్లించాకే రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపట్టాలని మండల పరిధిలోని గంగాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకుని శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా తమ పట్టాభూములు కోల్పోయామన్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని వాపోయారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, తమ భూములకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని పనులను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సలీమ్, ఎస్‌ఐ సైఫ్‌అలీ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను కలెక్టర్‌కు వివరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
రోడ్డుపై బైఠాయించిన రైతులు