
న్యూస్‌రీల్
జిల్లాస్థాయి క్రీడా పోటీలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12 వరకు 69వ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14, 17 బాలురు, బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, ఇందులోనుంచి జిల్లా స్థాయి జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలు ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాలలో, క్రికెట్ స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
లడ్డూను దక్కించుకున్న ముస్లిం
మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో శివ భజరంగి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలందుకున్న గణపతి లడ్డూను వేలంపాటలో అదేగ్రామానికి చెందిన ముస్లిం యువకుడు మొహమ్మద్ జహంగీర్ దక్కించుకున్నారు. శనివారం రాత్రి నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.14,916కు జహంగీర్ దక్కించుకున్నారు. కాగా, హిందూ పండుగలో ముస్లిం యువకుడు భాగస్వామి కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
నాచగిరి ఆలయ
ద్వారబంధనం
వర్గల్(గజ్వేల్): సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాచగిరి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజాకార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులకు దర్శనం ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి విజయ రామారావు తెలిపారు.
వంటేరుకు ప్రముఖుల పరామర్శ
జగదేవ్‌పూర్(గజ్వేల్): మాతృవియోగంతో బాధపడుతున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పరామర్శించారు.
సమస్యల పరిష్కారానికి కృషి
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్
సిద్దిపేటజోన్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. బతుక మ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధా న కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ ప్రతినిధులు బలరాం, వికాస్, ప్రవీణ్ పాల్గొన్నారు.

న్యూస్‌రీల్

న్యూస్‌రీల్