అంగన్‌వాడీలా! | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలా!

Sep 8 2025 9:41 AM | Updated on Sep 8 2025 9:41 AM

అంగన్

అంగన్‌వాడీలా!

● అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం ● ఆట వస్తువుల పరిస్థితి అంతంతే ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ కలెక్టర్‌ హైమావతి

● అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం ● ఆట వస్తువుల పరిస్థితి అంతంతే ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ

చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నారులు, గర్బిణీలు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు బాల్యం నుంచే చదువుపై ఆసక్తి కల్పించే లా ఆట, పాటలతో బోధించేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరైన వసతులు లేకపోవడం వల్ల పిల్లలను అంగన్‌వాడీలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తిచూపడం లేదు. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో అరకొర వసతులు వేధిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

ఏడు అద్దె భవనాల్లో

మండలంలో మొత్తం 54 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 28 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలుండగా, 19 కేంద్రాలు అద్దె లేని భవనాల్లో కొనసాగుతుండగా, ఏడు కేంద్రాల్లో అద్దె భవనాల్లో సాగుతున్నాయి. ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి అద్దె చెల్లిస్తోంది. అద్దె మొత్తం కంటే ఎక్కువగా ఉంటే టీచర్లు మిగిలిన డబ్బు భరించాలి.

నిలిచిపోయిన నిర్మాణాలు

అద్దె భవనాల్లో ఉన్న కొన్ని కేంద్రాలకు గతంలో భవనాలు మంజూరైనా పనులు అసంపూ ర్తిగా నిలిచిపోయాయి. మరికొన్నింటికి పనులు ప్రారంభం కాలేదు. చిన్నకోడూరులో రెండు భవనాలు, ఎల్లాయపల్లిలో ఒక భవ నం నిర్మాణ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. అధికారులు స్పందించి భవనాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి

కొండపాక(గజ్వేల్‌): విద్యార్థులకు నాణ్యమైన బోధన, భోజనం అందేలా చూసుకోవాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. కొండపాకలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను ఆదివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి పూట అందించిన భోజనాన్ని పరిశీలిస్తూ ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయన్న విషయమై కలియ తిరుగుతూ పరిశీలించారు. మురికి కాలువలు చెడిపోవడంతో దుర్వాసన వస్తున్న విషయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టర్‌ దృష్టికి తేవడంతో స్పందించి వెంటనే పనులు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఫోన్‌ ద్వారా ఆదేశించారు. అక్కడక్కడ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ..కామన్‌ డైట్‌ మెనూను పాటించాలన్నారు. విద్యాపరమైన అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

తల్లిపేరు మీద మొక్క నాటాలి

సిద్దిపేటరూరల్‌: జిల్లాలో కలెక్టర్‌ ఆదేశాల మేర కు ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌పే’ అనే నినాదంతో ప్రతీ అధికారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్‌ కె.హైమావతి ఆదివారం పిలుపునిచ్చారు. 9న తల్లి పేరున ఒక మొక్క స్ఫూర్తితో జిల్లాలోని అధికారులంతా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో గుర్తించిన 13,900ల మంది ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

అంగన్‌వాడీలా!1
1/2

అంగన్‌వాడీలా!

అంగన్‌వాడీలా!2
2/2

అంగన్‌వాడీలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement