సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: ఇంటర్ అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఆ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం గరిమా అగర్వాల్ అధ్యక్షతన పరీక్షల నిర్వాహణపై సమావేశం నిర్వహించారు. గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 29వ తేది వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయన్నారు. సమావేశంలో రెవెన్యూ, వైద్య, మిషన్ భగీరథ, పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్, అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్


