దేశ ఖ్యాతిని పెంచిన నరేంద్రమోదీ | Sakshi
Sakshi News home page

దేశ ఖ్యాతిని పెంచిన నరేంద్రమోదీ

Published Tue, Apr 16 2024 6:45 AM

దుబ్బాక: ఇంటింటా ప్రచారంలో బీజేపీ నేతలు   - Sakshi

బీజేపీ రాష్ట్ర నాయకుడు బాలేశ్‌గౌడ్‌

దుబ్బాక: ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని పెంచిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు అంబటి బాలేశ్‌గౌడ్‌ అన్నారు. సోమవారం 38వ బూత్‌లో మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుధారెడ్డి, భాస్కర్‌, ప్రవీణ్‌, రమేశ్‌రెడ్డి, రమణారెడ్డి, రాజు, నిఖిల్‌రెడ్డి ఉన్నారు.

బండి సంజయ్‌ విజయం ఖాయం..

బెజ్జంకి(సిద్దిపేట): కరీంనగర్‌ ఎంపీగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మరోసారి విజయం సాధించడం ఖాయమని ఆపార్టీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని దేవక్కపల్లెలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భూత్‌ కమిటీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి, లక్ష్మణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

దేశానికి మోదీ రక్షణ కవచం..

హుస్నాబాద్‌: బండి సంజయ్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బీజేపీ నాయకులు 19వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ దేశానికి రక్షణ కవచంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు శంకర్‌ బాబు, నాగార్జున్‌, కిషోర్‌, గణేశ్‌, శ్రావణ్‌ కుమార్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement